షాకింగ్ :‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ బిజినెస్

ఫ్లాఫుల్లో ఉన్నా సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. వరస పెట్టి ఆరు ఫ్లాప్ లు వచ్చినా ఆయన బిజినెస్ లో వెనకడుగు లేదు. ఆ విషయం ఆయన తాజా చిత్రం ప్రూవ్ చేస్తోంది.

సాయి తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’. సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా సేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ చిత్రి ప్రీ రిలీజ్ బిజినెస్ ని నిర్మాతలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసారు. 13. 73 కోట్ల బిజినెస్ వరకూ జరిగింది. ఏరియా వైజ్ బ్రేకప్ తో వివరాలు క్రింద..

ఏరియా బిజినెస్ (కోట్లలో )

————— ————————————————–

నైజాం 3.00

సీడెడ్ 1.80

నెల్లూరు 0.48

కృష్ణా 0.90

గుంటూరు 1.10

వైజాగ్ 1.35

ఈస్ట్ గోదావరి 0.96

వెస్ట్ గోదావరి 0.84

టోటల్ (ఆంధ్రా & తెలంగాణా) 10.43

ఓవర్ సీస్ 1.80

మిగిలిన ప్రాంతాలు 1.50

మొత్తం (ప్రపంచ వ్యాప్తంగా) 13.73