`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`: రానా కంటే బాగా సూట్ అయ్యాడుగా!

మ‌రి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. ఇప్ప‌టిదాకా విడుద‌ల చేసిన రెండు పాటల‌తోనే సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశారు ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇప్ప‌టిదాకా కూడా ఎక్క‌డా ఆ బ‌యోపిక్ మూవీలోని క్యారెక్ట‌ర్ల‌ను రివీల్ చేయ‌లేదు. శుక్ర‌వారం రాత్రి ఆయ‌న ఓ క్యారెక్ట‌ర్ పిక్‌ను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. `లక్ష్మీస్ ఎన్టీఆర్‌`లో ఈ యాక్ట‌ర్ ఏ పాత్ర పోషిస్తున్నారో చెప్ప‌గ‌ల‌రా?` అనే సింపుల్ క్వ‌శ్చ‌న్ వేశారు.

ఈ క్యారెక్ట‌ర్‌ను చూడ‌గానే అర్థం చేసుకోవ‌చ్చు అది ఎన్టీ రామారావు అల్లుడు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిద‌ని. క‌దా! ఆ న‌టుడి పేరేంటో రివీల్ చేయ‌లేదు ఆర్జీవీ. నంద‌మూరి బాల‌కృష్ణ బ‌యోపిక్‌లో చంద్ర‌బాబు నాయుడి పాత్రను పోషించిన రానా కంటే కూడా అచ్చు గుద్దిన‌ట్టు దిగిపోయాడ‌నేది మాత్రం హండ్రెడ్ ప‌ర్సెంట్ ష్యూర్‌.

దీన్ని బ‌ట్టి చూస్తే ఆర్జీవీ.. తాను తీసిన బ‌యోపిక్‌లోని పాత్ర‌ల‌ను ఒక్క‌టొక్క‌టిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌డం మొద‌లు పెట్టిన‌ట్టేన‌నిపిస్తోంది. ఇప్పుడు చంద్ర‌బాబు, త్వ‌ర‌లో ల‌క్ష్మీపార్వ‌తి, ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ల పిక్‌ల‌ను కూడా ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా రివీల్ చేయ‌డం ఖాయం. ఈ పిక్‌లో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే.. చంద్ర‌బాబు నాయుడిది ఇప్పుడున్న గెట‌ప్ కాకుండా.. ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేసే స‌మ‌యం నాటి గెట‌ప్ కావ‌డం విశేష‌మే మ‌రి!