దారుణమైన ఫ్లాఫ్ నుంచి రవితేజ తప్పించుకున్నాడు..లక్కీ ఫెలో
అసలే రవితేజకు గత కొంతకాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తంది. వరస పెట్టి ఆయన సినిమాలన్నీ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన కొత్త చిత్రాలు ఒప్పుకునే ముందు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఓ ప్రక్కన ఆయనపై బిజినెస్ తగ్గిపోయింది..నిర్మాతలు, దర్శకులు ఆయన చుట్టూ తిరగటం తగ్గించేసారు. ఈ నేపధ్యంలో సుధీర్ వర్మ ఓ కథ పట్టుకుని తన దగ్గరకు వచ్చారు. అయితే మొదట కథ నచ్చి ఓకే అనుకున్నారు. అయితే కొంత కాలం అయిన తర్వత ఆ స్దాయి బడ్జెట్ వర్కవుట్ కాదని, రవితేజ కు యంగ్ గెటప్ ఆడ్ గా ఉంటుందని నిర్మాతలకు అనిపించింది. అంతే రవితేజకు అదే చెప్పారు. ఆయన వద్దనేసారు. అప్పుడు ఆ కథ శర్వానంద్ కు దగ్గరకు వెళ్లి తెరకెక్కింది.
ఇప్పుడీ సినిమా చూసిన వాళ్లంతా లక్కీగా రవితేజ ఈ ప్లాఫ్ వేటు నుంచి తప్పించుకున్నాడంటున్నారు. ఆ స్దాయి డిజాస్టర్ టాక్ మార్నింగ్ షోకే వచ్చేసింది. పరమ రొటీన్ కథ,కథనంతో సినిమా బోర్ కొట్టేసింది. రవితేజకు ఖచ్చితంగా మరో ప్లాఫ్ ఆయన ఖాతాలో పడి ఉండేది. అది లక్కిగా తప్పించుకున్నాడు. లేకపోతే ఈ పాటికి మీడియా మొత్తం రవితేజను టార్గెట్ చేసేది అంటున్నారు.
యంగ్ హీరో శర్వానంద్ నటించిన రణరంగం సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో యంగ్ హీరో అడవి శేష్ నటించిన ఎవరు సినిమాకు పోటీగా బాక్సాఫీస్ రణరంగంలోకి దిగింది. శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శని జంటగా నటించిన ఈ సినిమాకు ఫ్లాఫ్ టాక్ వచ్చింది. టేకింగ్ పరంగా మంచి మార్కులే ఉన్నా పాత కథకు రొటీన్ పూత పూసేశారంటూ విమర్శకులు తేల్చేశారు. ప్రేక్షకులు ముందే చేతులు ఎత్తేసారు.