ఇంత దారుణమా? ‘రంగస్థలం’ కన్నడ, మళయాళ వెర్షన్ కలెక్షన్స్

భారీ షాక్ ఇచ్చిన ‘రంగస్థలం’ కన్నడ, మళయాళ వెర్షన్స్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్..సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు…కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాని దాదాపు ఏడాది తర్వాత మళయాళ, కన్నడ వెర్షన్స్ రిలీజ్ చేసారు. రామ్ చ‌ర‌ణ్ సినిమాల‌కు తెలుగుతో పాటు మ‌ళ‌యాలంలో కూడా మంచి ఇమేజ్ ఉండటంతో ఆ ధైర్యం చేసారు. మ‌గ‌ధీర సినిమాతో అక్కడ విజ‌యం సాధించాడు రామ్ చ‌ర‌ణ్.

ఆ త‌ర్వాత కూడా చ‌ర‌ణ్ సినిమాలు కొన్ని మ‌ల‌యాళంలో హిట్ అయ్యాయి.ఈ నేపధ్యంలో రంగస్దలం కూడా అదే స్దాయిలో వర్కవుట్ అవుతుందనుకున్నారు. అయితే కన్నడ, మళయాళంలో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కర్ణాటకలో వంద కు పైగా థియోటర్స్ విడుదల చేస్తే… కోటి అరవై లక్షలు మాత్రమే వచ్చింది. అదే మళయాళ వెర్ష్ కు వచ్చేసరికి మరీ దారుణంగా ..కేవలం అరవై లక్షలు మాత్రమే వచ్చింది. తెలుగులో రిలీజ్ అయిన ఇంతకాలానికి అక్కడ డబ్బింగ్ చేయటం మైనస్ గా నిలిచిందని అందుకనే అంత పూర్ కలెక్షన్స్ వచ్చాయని విశ్లేషిస్తున్నారు ట్రేడ్ పండితులు.

1980 నాటి స్టోరీతో గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన చరణ్ తో పాటు సమంత, ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్‌, నరేశ్ ప్రతీ ఒక్కరు అద్బుతంగా చేసారు. ‘రంగస్థలం’ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో పాటు రూ.115 కోట్ల షేర్ రాబట్టింది.