ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన చేసి ఆకట్టుకున్న రమ్యకృష్ణ ఇప్పుడు విలక్షణమైన పాత్రలకు షిప్ట్ అయ్యింది. ముఖ్యంగా బాహుబలి లో శివగామి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేయటంతో..ఆ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు.దాంతో వయస్సుతో సంబంధం లేకుండా ఆఫర్స్ సంపాదించుకుంటూ క్రేజ్ తో వెలిగిపోతోంది. ఈ నేపధ్యంలో రమ్యకృష్ణ ఓ ఆసక్తికర పాత్రలో నటించేందుకు సాహసించింది.
ఓ తమిళ సినిమాలో పోర్న్ స్టార్ పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ విషయాన్నే మీడియాలో హైలెట్ చేస్తున్నారు. రేపు రిలీజ్ కు ఈ పాత్రే ఓపినింగ్స్ తెచ్చిపెడుతుందని ట్రేడ్ వర్గాల నమ్ముతున్నాయి. అయితే ఫోర్న్ స్టార్ అనగానే జనం ఎక్సపెక్టేషన్స్ తో వస్తారని..వారి అంచనాలు ఏ మేరకు రీచ్ అవుతారో చూడాలని తమిళ సినిమా జనం అంటన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ సైతం..ఏవన్నా హాట్ సన్నివేశాలు ఉంటాయా అని ఎంక్వైరీ చేస్తున్నారట. అయితే అది చీప్ సినిమా కాదు.ఏదో చూపెట్టి సొమ్ము చేసుకోవటానికి. విజయ్ సేతుపతి వంటి స్టార్ నటిస్తున్న సినిమా.
ప్రముఖ హీరో విజయ్ సేతుపతి, సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘సూపర్ డీలక్స్’. త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్రలో కనిపించనుంది. ‘లీల’ అనే శృంగార తార పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నట్టు చిత్ర దర్శకనిర్మాతలు వెల్లడించారు.
ఈ క్యారక్టర్ లో నటించేందుకు తొలుత నటి నదియాను సంప్రదించగా, అందుకు ఆమె తిరస్కరించడంతో రమ్యకృష్ణను తీసుకున్నట్టు చెప్పారు. కథ విన్న వెంటనే మరో మాట లేకుండా ఈ పాత్రలో నటించేందుకు రమ్య అంగీకరించారని వారు తెలిపారు. ఈ పాత్ర తన కెరియర్ లో ఛాలెంజింగ్ రోల్ అంటూ చెప్పుకొచ్చారు రమ్యకృష్ణ.
సినిమాలో ఎన్నడూ లేని విధంగా ఓ సీన్ కోసం దాదాపు 37 టేకులు తీసుకున్నారట. సినిమాకు హైలెట్ గా నిలిచే ఆ సీన్ లో రమ్యకృష్ణ నటన అద్భుతమని అంటున్నారు చిత్రయూనిట్. సినిమాలో మల్లూ అన్ కట్ అనే సినిమాలో పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ కనిపిస్తారు. సినిమాకు ఆమె నటన హైలెట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మిస్కన్ అందిస్తున్నారు. మార్చి 29న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.