ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే సంచలనాలకు కేంద్ర బింధువుగా మారిన ఈ సినిమా ప్రమోషన్ విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రంకు ప్రి రిలీజ్ బిజినెస్ మంచి క్రేజ్ తో జరుగుతోందని మీడియాలో గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాటిలో నిజం లేదని వర్మ తేలుస్తూ ఓ ప్రకటన చేసారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబందించి గమనిక లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న రక రకాల వార్తల్లో నిజాలు లేవు …ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు Gv films , RGV మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు’ అంటూ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మార్చి 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్‌లో చూపించని ఎన్నో ఈ నిజాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆడియన్స్.