షాకింగ్: ‘మజిలీ’మూడు రోజుల కలెక్షన్స్

మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన మజిలీ సినిమా బాక్సాఫీసుని షేక్ చేసేస్తోంది. ఎఫ్ 2 సినిమా తర్వాత ఆ స్దాయిలో హౌస్ ఫుల్ బోర్డ్ లు రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నాయి. మొన్న శుక్రవారం విడుదలైన మజిలీ సినిమా మంచి ఓపినింగ్స్ ని రాబట్టి… నాగ చైతన్య కెరీర్ లో ఫస్ట్ డే … సెకండ్ హైయ్యెస్ట్ గ్రాస్ గా నిలిచింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 7 కోట్లు కొల్లగొట్టింది మజిలీ. ఫస్ట్ వీకెండ్ వసూలు చేసిన కలెక్షన్స్ గురించే ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

మొదటి రోజు రూ.7కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండోరోజులకు రూ.20కోట్లు రాబట్టింది. అలాగే ఫస్ట్ వీకెండ్‌లో(ఆదివారానికి) ప్రపంచవ్యాప్తంగా రూ.32కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రూ.21కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో మూడురోజులకు రూ.5.91కోట్ల షేర్ రాబట్టింది.

మార్కెట్లో పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో ‘మజిలీ’కి ప్లస్‌గా కనిపిస్తోంది. లవ్, ఎమోషన్ కలబోతగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. 2019 హిట్ సినిమాల జాబితాలో మజిలీ చేరిపోయింది. ఇదే స్పీడు ఈ రోజు కూడా కొనసాగితే ఫస్ట్ వీక్ లోనే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచే అవకాశం ఉంది.

ఈ సినిమాకు నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చిన సంగీతం సినిమాకు ఎమోషనల్ కనెక్టివిటిని సెట్ చేస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మొత్తానికి డైరక్టర్ శివ నిర్వాణ ద్వితీయ విఘ్నాన్ని సక్సెస్‌ఫుల్‌గా దాచేశాడు.