ఫ్యాన్స్ ఒత్తిడితోనేనా? దిల్ రాజు ప్రకటన

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి’ అనుకున్నట్లుగానే వాయిదా పడింది. ‘భరత్‌ అనే నేను’ మూవీ తరువాత సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు చేస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, పోస్టర్స్‌తో ప్రిన్స్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహర్షిపై రోజురోజుకు క్రేజ్‌ పెరిగి పోతుండగా.. ఈ మధ్యే చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు వాయిదా ప్రకటన అఫీషియల్ గా చేసారు దిల్ రాజు. వాయిదా పడుతుందంటూ ఈ రోజు ఉదయం నుంచి కంటిన్యూగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా దిల్ రాజు ని ట్యాగ్ చేస్తూ రచ్చ మొదలైంది. ఈ నేపధ్యంలో దిల్ రాజు ప్రకటన చేసి క్లారిటి ఇచ్చారు. 

ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల 25కు వాయిదా వేశారు. ఏదేమైనా ఈ సినిమా కచ్చితంగా 25నే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవల స్పష్టం చేసింది. అంతలోనే సినిమా మళ్లీ వాయిదా పడినట్లు నిర్మాత దిల్‌రాజు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. మార్చి 17కి టాకీ పార్ట్‌ పూర్తవుతుందని పేర్కొన్నారు. మరో రెండు పాటల షూటింగ్ మిగిలుందని తెలిపారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ . దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అల్లరి నరేశ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు.