రీసెంట్ గా అందరి నోట్లో నానిన హీరో యశ్. ఓ కన్నడ సినిమా గురించి, అందులో నటించిన హీరో గురించి మన తెలుగు వాళ్లు ఆప్టర్ ఎ లాంగ్ బ్యాక్ మాట్లాడటం జరిగింది. అంతలా క్రేజ్ తెచ్చుకున్నాడు యశ్. కెజిఎఫ్ చిత్రం ఘన విజయం సాధించటంతో అందరి దృష్టీ అతనిపై పడింది. అయితే ఇప్పుడా ఇమేజ్ కు డ్యామేజ్ జరిగే పరిస్దితి ఏర్పడింది.
కెజిఎప్ హిట్ అవటంతో ఆయన గతంలో నటించిన చాలా సినిమాలను తెలుగులో డబ్ చేసి వదలటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు తెలుగులో కొందరు డబ్బింగ్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అక్కడ ప్లాఫ్ అయిన యశ్ సినిమాలు తక్కువ రేటుకు దొరుకుతాయి కాబట్టి వాటిని కొనేసి , డబ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు.
అందులో భాగంగా..యశ్ నటించిన 2013 లో రిలీజైన సినిమా చంద్ర ని తెలుగులో వస్తోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ జరుగుతోంది. ఇందులో యశ్ , శ్రీయ తదితరులు నటించారు. ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూపా అయ్యర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది గమనించిన చాలా మంది…యశ్ నటించిన క్వాలిటీ సినిమాల్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే యశ్ ఇమేజ్ కి దెబ్బేమీ ఉండదు. కాకపోతే జనంలో ఇమేజ్ నాశనం అయ్యినట్లే అని హెచ్చరిస్తున్నారు. అయితే ఇందులో యశ్ కూడా చెయ్యగలిగిందేం లేదు..చూస్తూండటం తప్ప.