కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘కేజీఎఫ్’. ఈ మూవీ జస్ట్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. ఈ చిత్రం కర్ణాటక రాష్ట్రంలో నాన్ బాహుబలి రికార్డ్‌ను కొల్లగొట్టేసింది. ఇప్పటికే కన్నడలో హీరోగా యశ్ కి మంచి క్రేజ్ వుంది. ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఆయనకు ఓ రేంజి క్రేజ్ క్రియేట్ అయ్యింది. కన్నడతో పాటు తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమా ఈ నెల 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్‌తో తాను ఫుల్‌గా ఖుషీ అవుతున్నట్టు యశ్ తెలిపాడు.
ఇక ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ చూసిన అమిజాన్ ప్రైమ్ వాళ్లు … 18 కోట్లకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్స్ అన్నిటికి ఈ డీల్ . ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా, తన జోరును మరింత పెంచుతుండటం విశేషం.
తెలుగులో ఇదే రోజున ‘అంతరిక్షం’ .. ‘పడి పడి లేచె మనసు’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఆ రెండు సినిమాలు ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక హిందీలో ఇదే రోజున షారుక్ ‘జీరో’ సినిమా విడుదలైంది. అయినా ఈ రెండు భాషల్లోని గట్టి పోటీని తట్టుకుని ఈ సినిమా నిలబడింది.
షారుక్ ‘జీరో’నాలుగు రోజుల్లో 69 కోట్లు వసూలు చేస్తే, ‘కేజీఎఫ్’ నాలుగు రోజుల్లో 75 కోట్లు రాబట్టడం విశేషం. ఇక తెలుగులో ఈ సినిమా హక్కులను 5 కోట్లకి సాయి కొర్రపాటి కొనుగోలు చేయగా, ఇప్పటికే 6 కోట్లకి పైగా షేర్ ను సాధించింది.