‘కవచం’తో ..వరుణ్ తేజ, శర్వానంద్ లకు కష్టం మొదలైంది

భాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలంటే సినిమా కంటెంట్ ఎంత ముఖ్యమో..రిలీజ్ డేట్ కూడా అంతకంటే ముఖ్యమని ట్రేడ్ లో ఉన్నవాళ్లు చెప్తూంటారు. అందుకే ఫెస్టివల్స్ లో సినిమాలు రిలీజ్ చేయటానికి అందరూ ఉత్సాహం చూపిస్తూంటారు. ఎందుకంటే సినిమా చూసే జనాలకు ఆ మూడ్ ఉండాలి..అంతకు మించి టైమ్, డబ్బు ఉండాలి. ఎక్కువగా ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయటానికి సినిమావాళ్ళు ఇష్టపడేది కూడా అందుకే.

కాబట్టే రిలీజ్ డేట్ లను సినిమా ప్రారంభం నుంచి ఫిక్స్ చేసుకోవటం మొదలెడతారు. అయితే ఆ రిలీజ్ డేట్ లను ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న సినిమావాళ్లు ఆక్యుపై చేసేస్తూండటం కూడా పరిపాటి. ఇప్పుడు వరుణ్ తేజ్, శర్వానంద్ సినిమాలకు అలాంటి దెబ్బే బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంతో తగిలేటట్లే ఉందని వినికిడి.

వరుణ్ తేజ తాజా చిత్రం అంతరిక్షం, శర్వానంద్ తాజా చిత్రం పడి పడి లేచే మనస్సులను డిసెంబర్ 21 న రిలీజ్ కు పెట్టుకున్నారు. అక్కడ నుంచి జనవరి ఫస్ట్ దాకా కలెక్షన్స్ క్రిసమస్, న్యూ ఇయర్ అంటూ సెలబ్రేషన్స్ తో జనం సినిమాలు చూడటానికి ఉత్సాహం చూపెడతారు. అలా క్యాష్ చేసుకునే అవకాసం ఉందని వారి ఆలోచన. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ వారి ప్లాన్స్ ని భగ్నం చేసేటట్లు కనపడుతున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం కవచం ను … డిసెంబర్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సినిమా టీజర్ కూడా బాగుంది. సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో సినిమా హిట్ అయ్యి..సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అయితే ..ఈ రెండు సినిమాలకు ధియోటర్స్ దెబ్బే. ఎందుకంటే రన్నింగ్ లో ఉన్న సినిమాని తీసేసి కొత్త సినిమాలు వేయరు. ఈ కొత్త టెన్షన్ ఇప్పుడు ఆ నిర్మాతలిద్దరకు పట్టుకుందిట.

ఇలా డిసెంబర్ 14న రిలీజ్ డేట్ ప్రకటించటం బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ ఆలోచన అని తెలుస్తోంది. నిర్మాతగా ఆయన అనుభవంతో చేసిన పని ఇది అంటున్నారు. అలాగని ఈ రెండు సినిమాల గురించి ఆలోచించి ముందుకు వెళ్దామంటే సంక్రాంతి సీజన్, రిపబ్లిక్ డే మొత్తం ఆక్యూపై అయ్యాయి. అంటే పిబ్రవరి దాకా మళ్లీ సినిమా వెయ్యటానికి కుదరదు. కాబట్టి కవచం టీమ్ ఆలోచనా రైటే.