‘కబీర్‌ సింగ్‌’ కలెక‌్షన్స్‌ పరిస్దితి ఏంటి?!

మొత్తానికి హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులుపుతున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసారు సందీప్ రెడ్డి వంగా. సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చినా తొలిరోజు ఈ చిత్రం ఏకంగా 21 కోట్లు వ‌సూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారీ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

షాహిద్‌ ఇంతకుముందు నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘పద్మావతి’ కలెక‌్షన్స్‌ను కూడా దాటేసి తన కెరీర్‌లోనే అత్యధిక కలెక‌్షన్స్‌ రాబట్టిన సినిమాగా ప్రస్తుతం కబీర్‌ సింగ్‌ నిలిచింది.

బాలీవుడ్ బాక్సాఫీస్‌ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం, అడ్వాన్స్‌ బుకింగ్‌లో సల్మాన్‌ ఖాన్‌ నటించిన భారత్, ఎవెంజర్స్‌ తర్వాత కబీర్‌ సింగ్‌ 3వ స్థానంలో నిలిచింది. యూత్ , మాస్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈ మూవీ విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడటం కలిసొచ్చింది.