అరిపించాడుగా..: హిందీ ‘అర్జున్‌ రెడ్డి’ ట్రైలర్‌!

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ వర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. కబీర్‌ సింగ్‌ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల టీజర్‌ను రిలీజ్ చేశారు. అర్జున్‌ రెడ్డి స్టైల్‌లోనే కట్ చేసిన టీజర్‌కు బాలీవుడ్‌లో సూపర్బ్‌ రెస్సాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేసారు. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడవచ్చు.

Kabir Singh – Official Trailer | Shahid Kapoor, Kiara Advani | Sandeep Reddy Vanga | 21st June 2019

ఇక ట్రైలర్ లో షాహిద్‌ కపూర్‌ కబీర్‌ సింగ్‌ పాత్రలో.. కియార అద్వాణీ ప్రీతిగా దుమ్ము దులిపారు. ఒరిజనల్‌లో ఉన్న ఫీల్‌ను రీమేక్‌లో కూడా ట్రాన్శఫర్ చేశాడు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. షాహిద్‌ పూర్తిగా కబీర్‌పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేడని అంటున్నారు. ఈ చిత్రం బాలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్‌ సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. జూన్‌ 21ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.