షాకింగ్ : ‘టాక్సీవాలా’ సక్సెస్ వెనక ఉన్నది ఆ స్టార్ డైరక్టర్!?

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీ టాక్సీవాలా. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్‌ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమా రిలీజ్‌ కన్నా చాలా రోజుల ముందే ఆన్‌లైన్‌ లో రిలీజ్ కావటంతో రిజల్ట్‌ ఎలా ఉండబోతుందన్న ఆందోళనలో పెట్టుకుంది చిత్రయూనిట్‌. దానికి తోడు చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది టాక్సీవాలా.

ఈ నేపధ్యంలో వచ్చిన టాక్సీవాలా యూత్ ని బాగానే ఆకట్టుకుంది. విజయ్‌ దేవరకొండ మరోసారి తన ఫాం చూపించాడని అంతా ఓటేసారు. అయితే ఈ టాక్సీవాలా ఇంతలా హిట్ కావటానికి కారణం ఎవరు అంటే..దర్శకుడు మారుతి అని తెలుస్తోంది.

డైరక్టర్ మారుతి స్నేహితుడే ఈ చిత్రం నిర్మాత ఎస్ కే ఎన్ కావటంతో ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. సినిమా హిట్ కు కారణమైన ఎడిటింగ్ దగ్గరుండి మారుతి చేసారట. డైరక్టర్ ఫైనల్ చేసిన ఎడిటింగ్ వెర్షన్ ని మరింత షార్ప్ గా మారుతి చేసారు. తన అనుభవంతో కామెడీ ఎలా పండుతుందనేది ఎడిటింగ్ లో చూపెట్టారు మారుతి.

ఒకటికి నాలుగుసార్లు డైరక్టర్ ఇచ్చిన ఫుటేజ్ చెక్ చేసి, మూడుగంటలకు పైగా వున్నసినిమాను ఓ షేప్ కు తీసుకువచ్చారు. సెన్సారుకు ఇచ్చిన తరువాత కూడా మారుతి, బన్నీవాస్ కలిసి మళ్లీ కాపీని చెక్కడమే కలిసి వచ్చింది. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే..అసలు టాక్సీవాలా కథను మొదట ఓకే చేసింది మారుతినేట. ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి చేద్దామనుకున్న సినిమా ఇది.