‘బ్రోచేవారెవరురా’ : ఈ పచ్చి బూతుల గోలేంటి బ్రో

శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్‌ మదిలో’ ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించారు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం సెకండాఫ్ లో పచ్చి బూతులు డైరక్ట్ గా పెట్టేసారని యూఎస్ ఆడియన్స్ గోలెత్తుతున్నారు.

అయితే విజువల్ గా ఎక్కడా మితి మీరలేదు కాని తెలుగు పచ్చి బూతులును షాకింగ్ లెవిల్ వాడారని చెప్తున్నారు. అయితే డైరక్ట్ గా ఆ బూతులు ఉండవు. కానీ ఫన్ లో కలిసి పోయి ఆ బూతులు వచ్చేస్తూంటాయి. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ మధ్యన జరిగే కొన్ని సీన్స్ లో ఈ బూతులు చోటు చేసుకున్నాయి. అయితే యుఎస్ ప్రింట్ లో అన్ సెన్సార్డ్ అంటే మ్యూట్ చేయకుండా వదిలేసారని, అదే తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శింపబడే ప్రింట్లలో మాత్రం బూతులు వచ్చేచోట మ్యూట్ చేసారని చెప్తున్నారు.

‘బ్రోచేవారెవరురా’ ఫస్టాఫ్ ఫన్ తో నింపేసారని, ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఓ ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఉంటుందని చెప్తున్నారు. కథ చాలా సింపుల్ అయినా తన స్క్రీన్ ప్లేతో వివేక్ ఆత్రేయ ఎంగేజ్ చేసాడని టాక్. డీసెంట్ ఎంటర్టైనర్ గా యూత్ కు ఎక్కే అవకాసం ఉందని చెప్తున్నారు.

ఈ చిత్రంలో విశాల్ (సత్యదేవ్) ఓ అప్ కమింగ్ డైరక్టర్. అతనో కథను శైలు(నివేదిత పేతురాజ్)కి వినిపిస్తూంటాడు. ఆ కథ…ముగ్గురు కుర్రాళ్లు రాహుల్ (శ్రీ విష్ణు), రాకేష్ (ప్రియదర్శి), రాంబాబు (రాహుల్ రామకృష్ణ) చుట్టూ తిరుగుతుంది. ఆ పిక్షన్ కథ..ఎలా మైత్రి (నివేదిత థామస్)కు నిజ జీవితంలో కనెక్ట్ అవుతుంది అనేది ఇంట్రస్టింగ్ చెప్పబడింది.