బాక్సాఫీస్ రిపోర్ట్ : నాగ్ “ఘోస్ట్” ఫస్ట్ డే వసూళ్లు సంగతేంటో చూడండి.!

నిన్న దసరా కానుకగా తెలుగు సినిమా దగ్గర రిలీజ్ అయ్యినటువంటి చిత్రాల్లో అక్కినేని నాగార్జున నటించిన అవైటెడ్ చిత్రం ఘోస్ట్ సినిమా కూడా ఒకటి. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ అయితే హీరోయిన్ గా నటించింది.

మరి ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం గట్టి పోటీ లోనే రిలీజ్ అయ్యింది. మిగతా సినిమాల వసూళ్లు ఓ మోస్తరుగా బాగానే ఉన్నాయి ఇక ఘోస్ట్ పరిస్థితి ఏంటో కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే ఏపీ మరియు తెలంగాణాలో నాగ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా వచ్చినట్టు తెలుస్తుంది.

మరి నైజాం లో 1.3 కోట్లు షేర్ రాగా సీడెడ్ లో ఒక కోటి ఉత్తరాంధ్ర రీజన్ లో 56 లక్షలు ఇక మిగతా మొత్తం ఏపీ వసూళ్లు కలిపి అయితే ఈ చిత్రానికి మొదటిరోజు 6 కోట్ల మేర షేర్ మరియు 11.5 కోట్ల గ్రాస్ వసూలు అయినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

ఇక వరల్డ్ వైడ్ అయితే అటు ఇటుగా ఒక కోటి తేడా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఘోస్ట్ కూడా మంచి ఓపెనింగ్స్ నే సాధించింది అని చెప్పాలి.