బాక్సాఫీస్ : ట్రేడ్ షాకయ్యేలా “గాడ్ ఫాదర్” డే 2 వసూళ్లు..వివరాలు ఇవే.!

దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా కోసం తక్కువ అంచనా వెయ్యడానికి లేదు. తన కెరీర్ లో ఎన్నో భారీ నష్టాలు సినిమాలు ఇచ్చిన ప్రతి సారి నెక్స్ట్ మాత్రం వాటికి అందని రేంజ్ లో వసూళ్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలకి షాకయ్యే నంబర్స్ నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి.

మరి అలాగే ఇపుడు ఆచార్య లాంటి భారీ ప్లాప్ తర్వాత ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో మెగాస్టార్ సత్తా చాటుతుండడం విశేషం. అయితే గడ్ ఫాదర్ వసూళ్లు ఎందుకు స్పెషల్ గా మారాయి అంటే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ మొదటి రోజు కేవలం 38 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

అయితే ఈ సినిమాకి టికెట్ ధరలు లేకపోవడం వల్ల మంచి పోటీలో కూడా రావడంతో తక్కువ నమోదు అయ్యాయి అనుకోవచ్చు. కానీ మన తెలుగులో ఎంత మొత్తంలో మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చినా రెండో రోజులో ఎంత స్టార్ అయినప్పటికీ సగానికి వసూళ్లు పడిపోతాయి. కానీ మెగాస్టార్ మాత్రం సత్తా చాటారు.

మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ అందుకున్న చిరు నెక్స్ట్ డే 31 కోట్ల గ్రాస్ ని అందుకున్నారు. దీనితో ఈ చిత్రం వసూళ్లు ట్రేడ్ వర్గాలు షాకయ్యేలా వచ్చాయి. పైగా దసరా హాలీడే తర్వాత వర్కింగ్ డే లో కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం అంటే ఇది పూర్తిగా మెగాస్టార్ స్టామినా అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో అయితే సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించగా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాని తెరకెక్కించారు.