బాక్సాఫీస్ రిపోర్ట్ : వరల్డ్ వైడ్ “గాడ్ ఫాథర్” మూడు రోజుల వసూళ్లు వివరాలు ఇవే.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార కీలక పాత్రలో సత్యదేవ్ సహా మరికొందరు స్టార్ నటులు నటించిన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాథర్”. దర్శకుడు మోహన రాజా తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

మరి టికెట్ రేట్స్ రీత్యా డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ చిత్రం రెండో రోజుకి కూడా వరల్డ్ వైడ్ స్టడీ వసూళ్లు అయితే అందుకుంది. మరి ఇపుడు మూడో రోజు వసూళ్లు డీటెయిల్స్ బయటకి వచ్చాయి. మరి రెండు రోజుల్లో అయితే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 69 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా..

ఇప్పుడు మూడో రోజు కూడా మెగాస్టార్ బాటింగ్ బాక్సాఫీస్ దగ్గర ఇలాగే కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి మూడో రోజు అయితే ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మేర గ్రాస్ ని టచ్ చెయ్యగా మొత్తం అయితే 80 కోట్ల దగ్గర వసూళ్ళు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు వారు చెబుతున్నారు.

ప్రస్తుతానికి అయితే సినిమా వసూళ్లు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు కానీ లాంగ్ రన్ లో అయితే జరిగిన బిజినెస్ కి గాను ఇంకా ఎక్కువ రాబట్టాల్సి ఉంది. ఈ మొత్తం ఎప్పుడు రాబడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించగా సల్మాన్ ఖాన్ ఎక్స్ టెండెడ్ క్యామియో రోల్ లో నటించారు.