క్రేజీ..యూఎస్ లో నిఖిల్ సినిమా సెన్సేషన్..”RRR” తర్వాత “కార్తికేయ 2”.!

చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు సినిమా దగ్గర బాక్సాఫీస్ సరైన సినిమాలతో మంచి వసూళ్లతో అదరగొడుతుంది. గత జూలై నెల ఒక నైట్ మెర్ కాగా ఈ ఆగస్ట్ నుంచి అయితే మళ్ళీ తెలుగు సినిమాలు దుమ్ము లేపుతున్నాయి.

మరి ఇది ఒక్క మన తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ లెవెల్లో సంచలనం రేపుతుండడం ఆశ్చర్యంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోల సినిమాలు ఏకంగా పలువురి బిగ్ స్టార్స్ సినిమాలు దాటి వెళ్తుండడం మరింత కేజ్రీగా మారింది.

అయితే లేటెస్ట్ గా నిఖిల్ నటించిన “కార్తికేయ 2” యూఎస్ బాక్సాఫీస్ లో ఊహించని రికార్డు నెలకొల్పింది. అది కూడా ఈ ఏడాదికి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) తర్వాత అందులోని రెండో శుక్రవారం నాటికి 94 వేలకి పైగా డాలర్స్ వసూళ్లతో నెంబర్ 2 చిత్రంగా నిల్చింది.

ఈ ఏడాది సినిమాల్లో RRR సినిమా 4 లక్షల డాలర్స్ కి పైగా రెండో వారపు శుక్రవారం వసూలు చేయగా దీని తర్వాత కార్తికేయ 2 మాత్రమే నిలిచింది. దీనితో అయితే ఈ సినిమా నిజంగానే సెన్సేషన్ ని నమోదు చేసిందని చెప్పాలి. మరి ఈ సినిమాని అయితే దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించగా కాల భైరవ సంగీతం అందించాడు.