పాపం సునీల్ అంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ జనం అంతా. హిట్టో..ప్లాఫ్ ..ఏదో ఒకటి హీరోగా చేసుకుంటూ పోతుంటే.అబ్బే నువ్వు నువ్వు హీరోగా వర్కవుట్ కావటం లేదు. తిరిగి వచ్చి కామెడీ చేసుకుంటే ఫుల్ బిజీ అయ్యిపోతావు అన్నారు. సర్లే అని వెనక్కి వచ్చి వరస సినిమాలు కమిడియన్ చేద్దామని మొదలెట్టాడు. మొదటగా తన మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రంలో చేసాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక సునీల్ గురించి మాట్లాడేవాళ్లే లేకుండా పోయారు.
ఇక తన పాత రోజుల్లోకి వెళ్లి శ్రీను వైట్ల డైరక్షన్ ..అమర్ అక్బర్ ఆంథోనిలో కామిడీ చేస్తే ఆ సినిమా నామ రూపాలు లేకుండా పోయింది. దాంతో అసలు సినిమా గురించే మాట్లాడేవాళ్లు లేరు. ఇక సునీల్ ని పట్టించుకునేదెవరు. దాంతో ఇప్పుడు సునీల్ పరిస్దితి డైలమోలో పడింది. కమిడియన్ గా ఏదన్నా సినిమాలో ఒప్పుకున్నాఆ పాత్ర తనకు కలిసి వస్తుందా రాదా అనే సందేహం మొదలైంది. అయితే సునీల్ ఓ విషయం మర్చిపోతున్నారు.
ఇంకా నువ్వు నాకు నచ్చావు సమయంలో బంతి లాంటి పాత్రలు ఇప్పుడు చేద్దామంటే కుదరదు. ఫ్రెష్ గా ఏదన్నా చేయాలి. కొత్త జనరేషన్ డైరక్టర్స్ తో చేయి కలపాలి. జబర్దస్త్ వంటి ఎపిసోడ్స్ సినిమాలో నడవని తెలుసుకోవాలి. కేవలం బ్యానర్ లేదా దర్శకుడుని చూసుకుని సినిమా ఒప్పుకుంటే ఫలితం ఉండదని ఈ రెండు సినిమాలు ప్రూవ్ చేసాయి. ఇప్పటికైనా సునీల్ రియలైజ్ కాకపోతే కెరీర్ ..రెంటికి చెడ్డ రేవడిలా మారుతుందనటంలో సందేహం లేదు.