ఆ సినిమా ఫ్లాఫ్…‘టాక్సీవాలా’కు ప్లస్,టీమ్ ఫుల్ ఖుషీ

కలిసొచ్చే టైమ్ వస్తే అన్ని వైపుల నుంచి అదే పనిగా కలసిరావటం మొదలవుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ‘టాక్సీవాలా’పరిస్దితి అదే. క్రితం శనివారం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పైరసీ పోటుని తట్టుకుని థియోటర్స్ లో సెటిలైంది. అయితే ఈ వారం వరస పెట్టి సినిమాలు ఉండటంతో కొద్దిగా కంగారుపడే పరిస్దితి వచ్చింది.

ముఖ్యంగా 24 కిసెస్ సినిమా కనుక యూత్ కు పడితే ..‘టాక్సీవాలా’కు దెబ్బే అని అంచనాలు వేసారు. అయితే ఊహించని విధంగా ‘24 కిసెస్’డిజాస్టర్ అవటంతో…‘టాక్సీవాలా’టీమ్ ఊపిరి పీల్చుకుని ఈ వీకెండ్ కూడా తమ హవా చూపించటానికి రెడీ అయ్యిపోయారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడిక ఎదురే లేకపోవటంతో వాళ్ల ఆనందానికి అంతేలేదు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ఆడియో వేదిక మీద నేను కోరినట్టు ప్రజలందరూ కలిసి థియేటర్లను నింపినందుకు ధన్యవాదాలు’’ అని అన్నారు. దర్శకుడు రాహుల్‌ మాట్లాడుతూ ‘‘టెక్నికల్‌గా సక్సెస్‌ సాధించామని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.

‘‘విజయ్‌ దేవరకొండకి సక్సెస్‌ కొత్తేం కాదు. అతను ఇప్పటికే ఎన్నో సక్సెస్‌లు అందుకున్నాడు. ఎస్‌కేఎన్‌కి మాత్రం ఇది తొలి విజయం. తన తొలి చిత్రం విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. మేం ఎంత సపోర్ట్‌ చేసినా, ఈ చిత్ర బృందం చేసిన కృషి గొప్పది’’ అని అల్లు అరవింద్‌ అన్నారు.

తెలుగమ్మాయిని ఎంకరేజ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రియాంకా జావల్కర్‌ అన్నారు. నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ ‘‘నిర్మాతగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వంశీ, బన్నీ, అరవింద్‌ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ సినిమాకు ఇంత హైప్‌ రావడానికి విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ కారణం’’ అని తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘‘టాక్సీవాలా పైరసీ అయినప్పుడు చాలా భయమేసింది. అయితే ప్రేక్షకులు అంతకుమించి హిట్‌ చేసి చూపించారు’’ అని చెప్పారు.