గద్దలకొండ గణేష్ మూడు రోజుల కలెక్షన్స్
వరుణ్ తేజ్ తాజా చిత్రం గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా రచ్చ రచ్చ చేస్తోంది. సినిమా విడుదలైన రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు వీకెండ్ అంతా వసూళ్లు నిలకడగా కొనసాగటంతో టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా డిస్ట్రిబ్యూటర్స్ కు ఆనందం కలిగిస్తోంది.
శుక్ర, శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.13.8 కోట్ల షేర్ సాధించింది. యూఎస్‌లో కూడా ఈ చిత్ర వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నట్లు వస్తున్నట్లు సమాచారం. దాంతో ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల కు గాను 15.43 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా సి సెంటర్ల వద్ద ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ లుక్ ఉన్న సినిమా ఇదే కావటం కలిసొచ్చింది. ఏరియా వైజ్ కలెక్షన్స్ చూస్తే…
ఏరియా షేర్ (కోట్లలో)
——— ————–
నైజాం 4.54
సీడెడ్ 2.05
నెల్లూరు 0.55
కృష్ణా 1.07
గుంటూరు 1.23
వైజాగ్ 1.64
ఈస్ట్ గోదావరి 1.03
వెస్ట్ గోదావరి 0.97
మొత్తం ఆంధ్రా మరియు తెలంగాణాలలో 13.08
భారత్ లో మిగతా ప్రాంతాలు 1.00
ఓవర్ సీస్ 1.35
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ 15.43
ఇక ఈ జోరు అక్టోబరు 2న సైరా విడుదల అయ్యేవరకు కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా గ్యాంగ్ స్టర్ అవతారంలో వరుణ్ తేజ్.. అద్భుత నటనను ప్రదర్శించాడని ప్రశంసలు అందుతున్నాయి. మొదట ఈ సినిమా పేరు వాల్మీకి అనుకున్నా.. అనివార్య కారణాలతో సినిమా విడుదలకు 6 గంటల ముందు గద్దలకొండ గణేష్‌గా పేరు మార్చాల్సి వచ్చింది.