‘వాల్మీకి’ అక్కడ డిజాస్టర్

గద్దలకొండ గణేష్ కు అక్కడ గడ్డుగా ఉంది

హరీష్ శంకర్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చి విడుదలైన సినిమా వాల్మీకి. వరుస ప్రయోగాలతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఇరగతీసాడని టాక్ తెచ్చుకున్నాడు. అలాగే మహేష్ బాబు తో సహా సెలబ్రెటీలు ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురిపించారు. కలెక్షన్స్ కూడా ఆ స్దాయిలోనే వస్తున్నాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా సి సెంటర్ల వద్ద ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ లుక్ ఉన్న సినిమా ఇదే కావటం కలిసొచ్చింది.

అయితే ఓవర్ సీస్ లో మాత్రం ఈ సినిమా బాగా డ్రాప్ అయ్యింది. అక్కడ ఇప్పటిదాకా ఇంకా హాఫ్ మిలియన్ మార్క్ ని కూడా రీచ్ కాలేదు. వాస్తవానికి వరుణ్ తేజకు యుఎస్ లో మంచి మార్కెట్ ఉంది. ఫిధా, తొలిప్రేమ, ఎఫ్ 2 చిత్రాలు అక్కడ సూపర్ హిట్ అయ్యాయి. అయితే వాల్మీకి మాత్రం అక్కడ వర్కవుట్ కాకపోవటం. యుఎస్ తెలుగుసంస్థ 2.5 కోట్లకు ఈ హక్కులను తీసుకుంది. ఇందులో కొంత మొత్తం రికవరబుల్ వుంటుదని తెలుస్తోంది.మిగతాది లాసే అంటున్నారు. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ సినిమా నష్టాలే మిగల్చనుంది. మిగతా చోట్ల లాభాలు ఎలా ఉన్నా ప్రస్తుతం రికవరీ మోడ్ లో ఉంది.

ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామాలో వరుణ్ నటించనున్నారు. ఒక బాక్సర్ జీవితకథ నేపథ్యంలోని సినిమా ఇది. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు వెంకటేష్ (అరవింద్ తనయుడు)- సిద్ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టైటిల్ ఇంకా నిర్ణయించని ఈ సినిమా ఆగస్టులో సినిమా ప్రారంభం కానుంది. కథానాయికలు వగైరా వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్- వైజాగ్- న్యూ దిల్లీలో సినిమాని తెరకెక్కిస్తారట.