యూట్యూబ్ స్టార్ గా చిరపరిచితురాలు లిల్లీ సింగ్ . సూపర్ ఉమెన్‌గా పాపులారిటీని సంపాదించుకొన్న లిలీ సింగ్ కమిడియన్, రైటర్, యాక్టర్. ఈమెకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఇంత పాపులారిటీని సంపాదించుకొన్న లిలీ సింగ్ మరోసారి సంచలనంగా మారింది. తనపై వస్తున్న అనేక ఊహాగానాలకు తెర దించుతూ తన శృంగార జీవితాన్ని బయిటపెట్టింది. అంతేకాకుండా తన దారిలో నడువాలంటూ అభిమానులకు సూచించింది.
ఇంతకీ ఆమె చెప్పిందేమిటంటే…నేను బైసెక్సువల్ అని నేను బైసెక్సువల్‌ను అని సోషల్ మీడియాలో వెల్లడించింది. తన స్టేటస్‌ను ట్విట్టర్‌లో వెల్లడిస్తూ.. ఫీమేల్, తన వర్ణాన్ని, తన సెక్సువల్ స్టేటస్‌ను స్పష్టం చేసింది. ప్రతీసారి ఈ అంశాలు నా జీవితానికి అవరోధంగా నిలిచాయి. కానీ నేను వెనకడుగు వేయకుండా వాటిని ఆస్వాదిస్తున్నాను అని లిల్లీ సింగ్ ట్విట్టర్‌లో వెల్లడించింది.
నాలాగే మీరు కూడా సిద్దం కావాలి నాలాగే మీరు కూడా స్వలింగ సంపర్కానికి సిద్ధంకండి. అంతేకాకుండా ఆడ, మగతో ద్విలింగ సంపర్కాన్ని కొనసాగించండి. అలా చేయడానికి సిద్ధంగా ఉండే ప్రతీ ఒక్కరికి నేను ప్రోత్సాహం అందిస్తాను అని లిల్లీ సింగ్ పేర్కొన్నది. లిల్లీ సింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. లిల్లీ సింగ్‌కు అనూహ్య మద్దతు లిల్లీ సింగ్ ట్విట్టర్ స్టేటస్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది.