Katrina Kaif- Vicky Kaushal: విరుష్క పొరుగింట్లో విక్ట్రినా కొత్త సంసారం.. అన్ని అయ్యాకే వస్తారంట .!

Katrina Kaif- Vicky Kaushal: టీం ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ ల జంట గురించి ఎంత చెప్పినా తక్కువే. టీం ఇండియా లో విజయతవంతమైన కెప్టెన్ గా తనదైన ముద్ర వేస్తే.. బాలీవుడ్ లో ఒకవైపు హీరోయిన్ గా గ్లామర్ ఆరపోస్తూ మరోవైపు నిర్మాతగా అనుష్క విజయాపథం లో ముందుకు సాగిపోతుంది. సంపాదన విషయం ఒకరి మీద ఒకరు పోటీపడి మరీ సంపాదిస్తూ తగ్గేదేలే అంటున్నారు ఈ స్టార్ సెలబ్రిటీ జంట. ఇక విరుష్క జంట తమ గారాల పట్టి వామిక తో కలిసి ముంబై లోని జుహు లో గల విలాసవంతమైన అపార్టుమెంటు లో నివాసం ఉంటున్న సంగతి తెల్సిందే.

అయితే ఇప్పుడు ఇంకో స్టార్ సెలబ్రిటీ జంట విరుష్క పక్క బిల్డింగ్ లోకి రాబోతుందట. ఆ జంట ఎవరో కాదు.. బాలీవుడ్ నూతన దంపతులు విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ (విక్ట్రినా ). రాజస్థాన్ లో విలాసవంతమైన సిక్స్ సెన్సెస్ అనే ఫోర్టు లో వీళ్లద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యం లో ఈ నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు విరుష్క జంట. అంతేకాకుండా అతి తొందర్లోనే తమ పక్క అపార్టుమెంటులోకి రావాల్సిందిగా విక్ట్రినా జంటను కోరారు.

ఈ మధ్యనే పెళ్లి వేడుకులు ముగించుకున్న విక్ట్రినా జంట ఇప్పుడల్లా కొత్త బిల్డింగ్ కి వెళ్ళేటట్లు లేరు ఈ దంపతులు. ఎందుకంటే పలు ఆలయాలు సందర్శించి ఆ తర్వాత విహార వెళ్లే ఆలోచనలో ఉన్నారంట ఈ కొత్త జంట. ఆ తరువాతనే ముంబై లోని జుహు లో ఉన్న కొత్త బిల్డింగ్ కి మకాం మార్చనున్నారని సమాచారం. సముద్ర ముఖంగా ఉండే ఈ ఫ్లాట్ ని ఏరికోరి మరి తీసుకున్నారట ఈ నూతన జంట.