షూటింగ్ లలో యాక్షన్ సీక్వెన్స్ లు తీసేటప్పుడు అంతా చాలా అప్రమత్తంగా ఉంటారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అయితే చిన్న చిన్న దెబ్బలు అయితే లైట్ తీసుకుంటారు. కానీ పదిమూడు కుట్లు పడే పరిస్దితి వస్తే ఆ నటుడు పరిస్దితి ఎలా ఉంటుందో ఊహించండి.
భాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన యురి..ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో నటించిన బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కి షూటింగ్ లో అనుకోని ప్రమాదం జరిగింది. విక్కీ గత కొద్ది రోజులుగా భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుజరాత్ అనే హరర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా, ఓ భారీ డోర్ విక్కీపై పడింది. దీంతో అతని దవడ ఎముక విరిగింది. వెంటనే అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి ముంబైలో ని ఓ ప్రముఖ హాస్పటిల్ కు తీసుకెళ్ళారు. ఆయన దవడకి 13 కుట్లు పడ్డాయి. ఈ విషయాన్నీ బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఆన ట్విట్టర్ ద్వారా తెలిపారు . గుజరాత్ చిత్రంలో భూమి పడ్నేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.
విక్కి కెరీర్ విషయానికి వస్తే యురి విజయంతో ఫుల్ జోష్ మీదున్న విక్కీ కౌశల్ స్వాతంత్రోద్యమకారుడు ఉధమ్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ‘ఉధమ్‌సింగ్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. విక్కీ డోనార్, పింక్, అక్టోబర్, పికు చిత్రాల దర్శకుడు సూజిత్ సర్కార్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తున్నాడు . రోన్నీ లాహరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు విక్కీ కౌశల్ తక్త్ అనే చిత్రంలో ఔరంగజేబు పాత్ర పోషించాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.