స్టార్ హీరోయిన్ ని వెంబడించాడు,పోలీస్ లు అరెస్ట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణికపూర్ గుర్తుందా..అప్పట్లో నాని కి జంటగా ‘అహా కళ్యాణం’ చిత్రం చేసింది. ఆమె ఇప్పుడు తన అభిమానిపై ఓ ఫిర్యాదు చేసి వార్తలకు ఎక్కింది. ఈ బ్యూటీ తనను రక్షించమని పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

రాత్రి ముంబైలో షూటింగ్ ముగించుకుని వాణీకపూర్ తన కారులో ఇంటికి వెళ్తుండగా.. ఓ యువకుడు ఆమెని గమనించి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. మొదట క్యాజువల్ గా వస్తున్నాడేమో అనుకుంది . కానీ అదే పనిగా తను ఎటు వెళితే అటు, తను స్పీడు తగ్గిస్తే అతను తగ్గించి, పెంచితే పెంచటం వాణీ కపూర్ కారు డ్రైవర్ మరింత స్పీడుగా కారు నడిపాడు. ఆ యువకుడు కూడా ఏదో పిచ్చిపట్టిన వాడిలా ఆమెను వెంబడిస్తూ తను స్పీడు పెంచి కారుని అనుసరిస్తూనే వచ్చాడు.

దీంతో ఏం చేయాలో తోచని పరిస్దితుల్లో కారు డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్ కి పోనిచ్చింది. అక్కడ వాణీకపూర్ ఆ యువకునిపై ఫిర్యాదు చేసిందని సమాచారం. పోలీసులు వెంటనే ఆ యువకుడుని అదుపులో తీసుకున్నారు. విచారణలో ఆ యువకుడి పేరు సమీర్ ఖాన్ అని తెలిసింది. ఈ సంఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి!