బన్నితో నటించాలనేదే ఆ బాలీవుడ్ హీరో కోరికట

మన అల్లు అర్జున్ కు అభిమానులు హీరోలు రూపంలోనూ ఉంటున్నారు. వాళ్లు ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. ఆ విషయం మీడియా దగ్గర వెళ్లబుచ్చుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హైదరాబాద్ లో సందడి చేసినప్పుడు తన మనస్సులో కోరికగా బన్నితో నటించానే కోరికను చెప్పుకొచ్చారు.

హైదారాబాద్ కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఏర్పాటు చేసిన లైఫ్ స్టయిల్ షోరూమ్ ను టైగర్ ష్రాఫ్ ప్రారంభించాడు. అనంతరం అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులను తన డ్యాన్స్, స్టంట్స్ తో అలరించాడు.

టైగర్ ష్రాఫ్ మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ కు రావడం ఇదే తొలిసారని తెలిపాడు. హైదరాబాద్ కబాబ్, బిరియానీల గురించి విన్నాననీ, వాటిని రుచి చూస్తానని చెప్పాడు. తన తండ్రి జాకీ ష్రాఫ్ తెలుగు సినిమాల్లో నటించారని గుర్తుచేశాడు. తల్లిదండ్రులు లేకపోతే మనం లేమన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించాడు. ఇక టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమనీ, అవకాశం వస్తే బన్నీతో తప్పకుండా నటిస్తానని మనసులోని మాటను బయటపెట్టాడు.