“ఆదిపురుష్” సినిమాపై ఈ హాట్ బ్యూటీ క్రేజీ కామెంట్స్ వైరల్..!

ఇపుడు పాన్ ఇండియా సినిమా దగ్గర ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని ఉన్న పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు ఓంరౌత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తీసిన భారీ బడ్జెట్ సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఈ చిన్న లీక్ కూడా బయటకి రాకుండా జాగ్రత్తగా ఉన్నారు అంటే సినిమా యూనిట్ ఎంత పక్కాగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అందుకే ఈ సినిమా విషయంలో అయితే పాన్ ఇండియా లెవెల్లో గట్టి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కించగా ప్రభాస్ రామునిగా ఇతర స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రముఖ హాట్ బ్యూటీ లేటెస్ట్ గా “ఎఫ్ 3” ఇప్పుడు రాబోతున్న నాగార్జున “ఘోస్ట్” ఫేమ్ సోనాల్ చౌహన్ చేసిన క్రేజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆదిపురుష్ సినిమా ఒక అద్భుతం అని సినిమాలో కనిపించే రామాయణ అంశం చాలా గ్రాండ్ లెవెల్లో ఉంటుంది అని అలాగే ఈ సినిమా వచ్చాక ఇండియన్ సినిమాని ఆదిపురుష్ ముందు ఆదిపురుష్ తర్వాత అనే రేంజ్ లో ఉంటుంది అని తాను తెలిపింది. దీనితో ఈమె ఇచ్చిన ఈ సెన్సేషనల్ స్టేట్మెంట్ పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది.