బిగ్ అప్డేట్ : ప్రభాస్ “ఆదిపురుష్” టీజర్, పోస్టర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్డ్.!

ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఇప్పుడు నో డౌట్ గా పీయూన్గ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పాలి. తన ఒక్కో సినిమా మినిమమ్ 500 కోట్ల మార్కెట్ తో ఇప్పుడు ఉండగా డెఫినెట్ గా 1000 కోట్ల మార్క్ ని అయితే ఓ సినిమా అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్న భారీ చిత్రమే “ఆదిపురుష్”.

ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత మళ్ళీ పీరియాడిక్ టచ్ ఉన్న సినిమా ఇది కావడం పైగా ప్రభాస్ మొదటిసారి శ్రీరామునిగా కనిపించనుండడం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ సహా ఇతర బిగ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఆ సమయం ఎంతో దూరంలో కూడా లేదని ఫిక్స్ అయ్యినట్టు ఇది వరకే మేము తెలిపాము.

ఇంకా ఫైనల్ గా అయితే దర్శకుడు నుంచే ఈ సినిమా తాలూకా బిగ్ ట్రీట్ పై బిగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ సహా అవైటెడ్ టీజర్ ను కూడా ఈ అక్టోబర్ 2న అయోధ్య వేదికగా సరయు బ్యాంక్ దగ్గర అత్యంత ఘనంగా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు. దీనితో ఎంతో కాలం నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారీ అనౌన్సమెంట్ వచ్చేసింది అని చెప్పాలి.