తమన్నా ..ఇంత బోల్డ్ గానా,ఊహించలేం (వీడియో)

ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం తమన్నా ‘అభినేత్రి 2’, ‘f2’ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంది. ఇప్పుడు మరో చిత్రానికి సంతకం చేసేసింది. యంగ్ హీరో సందీప్‌ కిషన్‌కు జోడీగా ‘నెక్ట్స్‌ ఏంటి’ అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కునాల్‌ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. ఇక ఈ చిత్రం టీజర్ ఇప్పటికే రిలిజై క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ సైతం మాంచి హాట్ హాట్ డైలాగులతో సాగిపోయింది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Next Enti Theatrical Trailer | Next Enti New Telugu Movie | Sundeep Kishan, Tamannaah Bhatia,Navdeep

నవదీప్, పూనమ్ కౌర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లండన్, హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరోపక్క తమన్నా తెలుగులో ‘దటీజ్‌ మహాలక్ష్మి’ హిందీలో ‘ఖామోషీ’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.