కొన్ని సందర్బాల్లో కంట్రోలుగా మాట్లాడకపోతే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశమంతా సర్జికల్ స్ట్రైక్ 2 ని మెచ్చుకుంటూ మోడీని ప్రశంసిస్తూంటే …బాలీవుడ్ నటి స్వరభాస్కర్ మాత్రం ఆయన్ని తీసిపారేసింది. సర్లే ఆమె ఇంట్లో ఆమె మాట్లాడుకుంటే ఇబ్బంది లేదు..సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు అందరి కోపానికి కారణమవుతోంది.
వివరాల్లోకి వెలితే.. పుల్వామా ఘటనకు భారత్ తిరుగులేని ప్రతీకారం తీర్చుకున్న విషయం దేశం అంతటా సెలబ్రెట్ చేసుకుంటోంది. ఈ ఘటనతో ఇండియా, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.ఈ సమయంలో భావోద్వేగేలాను పరిగణనలోకి తీసుకోకుండా.. స్వర భాస్కర్ ప్రధాని నరేంద్ర మోడీని పై కామెంట్స్ చేసింది. ఆ తర్వాత అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది.
రాత్రంతా నిద్ర లేకుండా సోమవారం తెల్లవారు జామున 3: 40 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి ప్రవేశించి ఆపరేషన్ ప్రారంభించాయి. దాదాపు 20 నిమిషాల పాటు 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఆ రాత్రంతా ప్రధాని నరేంద్ర మోడీ నిద్రలేకుండా గడిపినట్లు వార్తలు వచ్చాయి. ఆపరేషన్ విజయవంతం అయ్యే వరకు ఆయన పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
క్షేమంగా తిరిగి వచ్చాక జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేసి, క్షేమంగా పైలెట్స్ అందరూ ఇండియాకు తిరిగి వచ్చే వరకు ప్రధాని మేల్కొనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ విజయవంతం అయిందని తెలుసుకున్న తర్వాత మోడీ విశ్రాంతి తీసుకున్నారట. మోడీ గురించి వస్తున్న ఈ వార్తలపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ స్పందించింది.
స్వరభాస్కర్ కామెంట్ చేస్తూ… మోడీ రాత్రంతా నిద్రలేకుండా ఉన్నారా.. ఇందులో గొప్పేముంది.. అది ఆయన డ్యూటీ అని ట్వీట్ చేసింది. దీనితో నెటిజన్లు స్వర భాస్కర్ పై విరుచుకు పడుతున్నారు. ఆమెకు సమాధానంగా రిప్లై కామెంట్ చేస్తూ.. నీవు రోజుకు కనీసం 18 గంటలు పని చేయగలవా.. చేయలేవు.. ఎందుకంటే నీకు అసలు ఏ పనీ లేదు అని ఘాటుగా బదులిచ్చాడు.
మరొకరు అయితే నిన్ను సినిమాల్లో మాత్రమే అభినందిస్తాం. ఇలాంటి విషయాల గురించి అభినందించడం నేర్చుకో.. లేకుంటే సైలెంట్ గా ఉండు అని సమాధానం ఇచ్చాడు. యస్.. ఇది మోడీ జాబ్ లో భాగమే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ సిటిజన్ గా విమర్శించడం మాని, అభినందించడం నేర్చుకో అని మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. ఇలా చాలా మంది ఆమెను ట్రోల్ చేసారు.