సడెన్ గా ప్రభాస్ “ఆదిపురుష్” కి మారిపోయిన పరిస్థితులు.!

టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరోగా నిలిచిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మరి తాను హీరోగా హిందీలో మొదటి సారిగా డైరెక్ట్ గా నటించిన తాజా చిత్రమే “ఆదిపురుష్”. హిందీ దర్శకుడు అయినటువంటి ఓంరౌత్ ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కించగా ప్రభాస్ రామునిగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకీదేవి పాత్రలో అలాగే సైఫ్ అలీఖాన్ రావణాసురుని పాత్రలలో నటించారు.

మరి సినిమాపై ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అలాగే టీజర్ రిలీజ్ ముందు వరకు కూడా భారీ అంచనాలు అందరిలో ఉన్నాయి. కానీ టీజర్ చూసాక అయితే ఒక్కసారిగా ఫ్యాన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కి కళ్ళు బైర్లుకమ్మాయి.

ఈ నాశిరకం విజువల్స్ కోసమా ఇన్నాళ్లు వెయిట్ చేశామా అన్న రేంజ్ లో అభిమానులు నిరాశ, కోపం వ్యక్తం చేశారు. ఇక దానితో అయితే చిత్ర యూనిట్ ఈ టీజర్, సినిమా మొబైల్స్ చూస్తే పనికి రాదనీ పెద్ద తెరపై అందులోని 3డి లో చూస్తేనే అందులో మాయాజాలం బాగా నచ్చుతుంది అని అంటున్నారు.

అలాగే హిందీలో మీడియాకి ముందే ఈ స్క్రిప్ట్ వెళ్లినట్టుగా వారు ముందు 3డి లో బాగుంది అని చెప్పారు. ఇక ఇపుడు మన తెలుగులో మీడియా వారికి నిన్ననే స్పెషల్ షోస్ 3డి లో టీజర్ వేయగా దీనిపై అయితే మన దగ్గర కూడా పరిస్థితులు మారిపోవడం విశేషం. మీడియా వారితో పాటుగా అభిమానులు కూడా అదే మాట చెప్తున్నారు. మరి అంత తేడా అయితే మొబైల్ లో వెండితెరకి వచ్చేసిందా అన్నట్టు సడెన్ గా ఈ టాక్ ఆసక్తిగా మారింది.