సల్మాన్‌ని భయపెట్టిన కిస్ సీన్!
ఐశ్వర్యారాయ్‌తో ప్రేమాయణం కారణంగా బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ అంటే కొంత నెగెటివిటీ స్ప్రెడ్ అయినా అతను పాటించే హద్దులు, నియమాల కారణంగా అతని క్రేజ్ పెరుగుతూనే వుంది. కొత్త వారిని ఆదరించడంలోనూ, న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడం లోనూ సల్మాన్ ఎప్పుడూ ముందుంటున్నారు. కొంత మంది హీరోల వారసుల్ని పరిచయం చేసే క్రమంలో అండగా వుంటూ వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ మంచి ఇమేజ్‌నే సొంతం చేసుకున్నాడు. అలాంటి సల్లూ భాయ్ అలియాభట్ భయపెట్టింది.
భన్సాలీ తగ్గడుగా ..
బాలీవుడ్ గ్రేట్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ త్వరలో `ఇన్షా అల్లా` పేరుతో ఓ ప్రమకథని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఎవర్‌గ్రీన్ లవ్‌స్టోరీస్‌ని వెండితెరపై ఆవిష్కరించడంలో సంజయ్‌ని మించిన స్పెషలిస్ట్ లేడన్నది బాలీవుడ్‌లో ఎవ్వరూ కాదన లేని విషయం. ఆయన నుంచి సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. మాకూ అవకాశం వుంటుందా? అని ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటి సంజయ్ `బాజీరావ్ మస్తానీ`, `పద్మావత్` చిత్రాల తరువాత సల్మాన్‌ఖాన్‌తో ఓ మూవీని ప్లాన్ చేశారు. అలియాభట్ హీరోయిన్.
నా వల్ల కాదు మహా ప్రభో!
ఈ ఇద్దరి మధ్య సినిమాలో లెక్కకు మించి లిప్ లాక్ సన్నివేశాలున్నాయట. ఆ సన్నివేశాలు తాను చేయలేనని, వాటిని తొలగించమని సల్మాన్ కోరాడట. కానీ సంజయ్ లీలా భన్సాలీ మాత్రం అందుకు అంగీకరించలేదని, దాంతో ఈ సినిమా నుంచి సల్మాన్‌ఖాన్ తప్పుకున్నాడని తెలిసింది. ఆ స్థానంలో షారుఖ్‌ని అడిగితే తను కూడా నటించడానికి అంగీకరించకపోవడంతో చివరికి హృతిక్‌రోషన్‌ని లైన్‌లోకి తీసుకొచ్చారట సంజయ్. కిస్ సీన్ భయపెట్టిన కారణంగానే సల్మాన్‌ఖాన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే అత్యంత భారీ చిత్రాన్ని కేవలం కిస్సు సీన్ కోసం వదులుకుంటాడా? అంటూ ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారంతా.