ఆన్ లైన్ షాపింగ్ చేస్తే ఆర్డరిచ్చిన వస్తువులు బదులుగా రాళ్లు, సబ్బులు వంటివి రావటం చాలా కాలంగా వింటూనే ఉన్నాం. తాజాగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ ఆమెకు షాకిచ్చింది. సోనాక్షి… బాష్ హెడ్ ఫోన్స్ ఆర్డర్ పెట్టగా, ఓ ఇనుప బోల్టు ముక్కను పంపింది.
దీంతో ఈ విషయంపై అమెజాన్ రిప్రజెంటివ్ తో మాట్లాడేందుకు సోనాక్షి యత్నించగా, అవతలివైపు నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. దీంతో అమెజాన్ కంపెనీ వ్యవహారశైలిని తప్పుపడుతూ సోనాక్షి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ హెడ్ ఫోన్స్ కోసం రూ.18,000 చెల్లించానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్యాకింగ్ అంతా బాగానే ఉన్నప్పటికీ హెడ్ ఫోన్స్ కు బదులుగా ఇనుప బోల్టును పంపారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
https://twitter.com/sonakshisinha/status/1072463812773711873
దీనిపై అమెజాన్ ప్రతినిధులకు ఫోన్ చేయగా, ఒక్కరూ సరిగా స్పందించలేదని వాపోయింది. ఈ ట్వీట్ కు అమెజాన్ కంపెనీని ట్యాగ్ చేసింది. దీంతో అమెజాన్ కంపెనీ వెంటనే స్పందించింది. జరిగిన ఘటనపై తాము విచారిస్తున్నామని తెలిపింది. ఆర్డర్ కు సంబంధించిన వివరాలను తమకు అందించాలనీ, ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.