కరీనా కపూర్ బాలీవుడ్ లో పెద్ద కుటుంబం నుంచి వచ్చి టాప్ హీరోయిన్ అయింది. హీరో సైఫ్ ఆలీఖాన్ ను పెళ్లాడి.. ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె కాల్షీట్స్ కోసం ఎగబడే దర్శక-నిర్మాతలు, ఆమె తమ సినిమాలో హీరోయిన్ అయితే బాగుంటుందని భావించే హీరోలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ.. ఫిట్ నెస్ కోసం ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. అయితే.. ప్రస్తుతం ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏకంగా ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ అయింది కూడా. రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన ‘సీత’ కథకు ఆమెను లీడ్ పాత్రలోకి తీసుకుంటున్నారనే వార్తే నెటిజన్ల వ్యతిరేకతకు కారణమైంది..
అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సీత పాత్రకు కరీనాను ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆమె 12 కోట్లు రెమ్యనరేషన్ తీసుకుంటోందని కూడా ప్రచారమైంది. దీంతో సీతగా కరీనా కపూర్ నటిస్తుందనే వార్త వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సీత’ పాత్రలో నటించేందుకు కరీనా కపూర్ అర్హురాలు కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. ఆమెనే ఫైనల్ చేశారనే వార్త తీవ్ర నిరసనకు కారణమవుతోంది. #boycottkareena khan, #BoycottKareenaKhan hindu అనే హ్యాష్ ట్యాగులు ఇప్పుడు ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఆమె సీతగా కాదు.. సూర్ఫణఖగా సరిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఆమె నటించిన పాత్రలు, సిగరెట్ కాలుస్తున్న ఫొటోలు, ఆమె డ్రెస్సింగ్ ఫొటోలను షేర్ చేస్తూ.. కరీనా కపూర్ సీత పాత్రకు తగదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటివలే ఆదిపురుష్ లో రావణుడిగా నటిస్తున్న కరీనా భర్త సైల్ ఆలీఖాన్ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. దీంతో క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు అతని భార్యపై అదే రామాయణ ఇతివృత్తం ఆధారంగా విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై కరీనా స్పందిస్తుందో లేదో చూడాలి.