షాకింగ్ : “ఆదిపురుష్” నుంచి ఆ విజువల్ లీక్ అయ్యిందా..?

పాన్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి ఒక మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ విజువల్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. దర్శకుడు ఓంరౌత్ తో చేసిన ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కించి ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు.

ఇక ఈ అక్టోబర్ 2 సినిమా పది ఎదురు చూస్తున్న పడిగాపులకి తెర దించుతూ అవైటెడ్ టీజర్ అలాగే పోస్టర్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వచ్చిన నెక్స్ట్ డే లోనే మేకర్స్ కి లీక్ షాక్ తగిలినట్టు తెలుస్తుంది.

సోషల్ మీడియాలో ఈ సినిమా నుంచి ఏకంగా వీడియో విజువల్ ని చిత్ర యూనిట్ కి చెందిన ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో లీక్ చేసాడట. దీనితో అది వెంటనే వైరల్ అయ్యింది కానీ మేకర్స్ వెంటనే అప్రమత్తం అయ్యి దాన్ని అతని చేత తీసివేయించారట. మరి ఇది అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు చూసినట్టు కూడా చెబుతున్నారు.

మొత్తానికి అయితే సినిమా అప్డేట్ పై చాలా ఎగ్జైట్మెంట్ నెలకొంది. ఇక ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే. ఇంకా ఈ భారీ సినిమా లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటించాడు.