Salman Khan: ఆ పాము నాకు మళ్ళీ కనిపించిందన్న కండలవీరుడు

Salman Khan: ఇటీవలే పాము కాటుకు గురైన బాలీవుడ్ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పాడు. నన్ను ఆ పాము మూడుసార్లు కాటేసింది. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నన్ను కాటేసిన పాము మళ్ళీ కనిపించింది. దానితో ఫోటో కూడా దిగాను. రాజమౌళి దర్శకత్వంలో నేను సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఒకవేళ ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎంతో సంతోషిస్తా అని సల్మాన్ ఖాన్ అన్నాడు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన ‘అంతిమ్’ సినిమాలో సల్మాన్ కీలకపాత్రలో కనిపించారు. పోలీస్ ఆఫీసర్ గా ఆయన పాత్ర అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ.. కథలో సత్తా లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక బాక్సఫీసు దగ్గర బోల్తాపడింది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్ జాన్’ సీక్వెల్ లో నటించబోతున్నారని సమాచారం. 2015లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుని అందుకే ఇప్పుడు సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నారు. దీనికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందించనున్నారు. రీసెంట్ గా ఆయన ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.