తమ పేజ్ వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్లు సెలబ్రెటీల జీవితాలపై ఆర్టికల్స్ రాస్తే ఊరుకునే రోజులు పోయాయి. సెలబ్రెటీలు సైలెంట్ గా ఉన్నా వాళ్ల అభిమానులు ఆగ్రహం తట్టుకోవటం కష్టంగా ఉంది. అలాంటి పరిస్దితే న్యూయార్క్ మ్యాగజైన్ కు చెందిన ది కట్ వెబ్ సైట్ కు ఎదురైంది. వాళ్లు ప్రియాంకపై రాసిన ఓ ఆర్టికల్ ని క్షమాపణ చెప్పి మరీ తొలిగించారు. ఇంతకీ ఏమా ఆర్టికల్..అసలేం జరిగిందో చూద్దాం.
వివిరాల్లోకి వెళితే… తన ప్రియుడు నిక్ జోనాస్‌ను పెళ్లాడి..ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న ప్రియాంకా చోప్రాపై విషం కక్కుతూ… వారి పెళ్లిని వక్రీకరిస్తూ.. న్యూయార్క్ మ్యాగజైన్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో ఓ వార్త ప్రచురితం అయ్యింది.
ఆ ఆర్టికల్ లో ..నిక్‌ను మోసం చేసి ప్రియాంక పెళ్లి చేసుకుందని, ఆమె జగమెరిగిన మోసగత్తె అని, కుట్ర పన్ని.. పెళ్లి పేరుతో నిక్‌ను మోసగించిదంటూ ‘ది కట్’ రాసుకొచ్చింది. ఇలా విషం జల్లిన ఆ వెబ్‌సైట్‌లో కథనంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ మ్యాగజైన్ చివరకు క్షమాపణ చెప్పింది. అంతే కాకుండా ఆ కథనాన్ని వెబ్‌సైట్ డిలీట్ చేసింది.
ఈ విషయంపై ప్రియాంక మాట్లాడుతూ…ఇలాంటి తలతిక్క గా విషం చల్లే పిచ్చి కథనాలను ఎప్పుడు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా పట్టించుకోనని స్పష్టం చేసింది. ఆ విషయం గురించి తాను మాట్లాడటం కూడా అనవసరమని… ఇటువంటి చెత్తవార్తలు తనను ఏమాత్రం డిస్టర్బ్ చేయలేవని ప్రియాంక వ్యాఖ్యానించింది.
ఇక ఈ నెల 2న క్రిస్టియన్ పద్ధతిలో, 3న హిందూ సంప్రదాయం ప్రకారం ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.