వైరల్ : “ఆదిపురుష్” డైరెక్టర్ కి ప్రభాస్ సీరియస్ వార్నింగ్..?

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్”. అటు బాలీవుడ్ నుంచి కానీ మన తెలుగు నుంచి కానీ ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో ఇది కూడా ఒకటి.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఇదిలా ఉండగా అభిమానులు సహా పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న అవైటెడ్ టీజర్ వీడియో ఎట్టకేలకు రీసెంట్ గా బయటకి వచ్చింది.

ఇక దీని తర్వాత వచ్చిన రెస్పాన్స్ కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ అంశంలో అన్నట్టు ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ ని తన రూమ్ కి పిలుస్తున్నట్టుగా ఓ వీడియో అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇందులో అందరు అనుకుంటున్నట్టు సీరియస్ మ్యాటర్ ఏది కాదట ఇది నార్మల్ వీడియోనే కాగా దానిని వేరేలా సర్క్యులేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికి అయితే ఈ టీజర్ విషయం పెద్ద ఇష్యూ అయ్యేలానే ఉంది. ప్రభాస్ నిజంగానే సీరియస్ అయ్యాడా లేక నార్మల్ వీడియో నా అనేది వారికే తెలియాలి కానీ ప్రస్తుతం ఓంరౌత్ విషయంలో మంచి వేడి వాతావరణమే కనిపిస్తుంది.