ప్రభాస్, అనుష్కలు ప్రేమలో ఉన్నట్లు,వారి మధ్య ఎఫైర్ ఉన్నట్లు చాలా కాలం నుంచీ మీడియాలో వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై చాలా సార్లు ప్రభాస్, అనుష్క లు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. అయినా రూమర్స్ కు మాత్రం తెరపడటం లేదు. ఈ విషయమై బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్‌కు కూడా ఓ ప్రశ్న అడిగితే బాగుంటుందనిపించింది. దాంతో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ప్రభాస్‌ను దీని గురించి అడిగారు కరణ్.
‘‘నువ్వు ‘దేవసేన’ అనుష్కతో డేటింగ్‌లో ఉన్నావని వస్తున్న గుసగుసలు నిజమా? కాదా?’’ అని అడిగారు. ఇందుకు ప్రభాస్..‘లేదు’ అన్నారు. ‘కానీ రూమర్స్ వినిపిస్తున్నాయి కదా..’ అని కరణ్ అడగ్గా.. ‘వాటిని మొదలెట్టింది మీరే..’ అని చమత్కరించారు. దాంతో కరణ్‌తో పాటు పక్కనే ఉన్న రాజమౌళి, రానా పగలబడి నవ్వుకున్నారు.
ఆ తర్వాత కరణ్ ప్రభాస్‌ను మరో ప్రశ్న అడిగారు. ‘నాకు అబద్ధాలు చెప్పావు కదూ..’ అని అడగ్గా.. ‘అవును’ అని చెబుతూ ప్రభాస్ అక్కడున్న గ్లాస్‌లోని డ్రింక్ తాగడం నవ్వొచ్చేలా ఉంది.
ఈ కార్యక్రమానికి ‘బాహుబలి’ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి హాజరైన సంగతి తెలిసిందే. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాలు హిందీలోనూ విడుదలైన సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్‌కు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ నిర్మాతగా వ్యవహరించారు.