‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో పాత్రపై పరిణీతి ఏమందంటే

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్.ఆర్‌’ సినిమాలో హీరోయిన్స్ పాత్రలకు బాలీవుడ్‌ నుంచి పరిణీతి చోప్రా, ఆలియా భట్‌ను సంప్రదించినట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై తొలిసారి పరిణీతి స్పందించారు. తన తాజా చిత్రం ‘కేసరి’పబ్లిసిటీ క్యాంపైన్ లో లో భాగంగా ఆమె మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెను‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ గురించి ప్రశ్నించగా.. తాను ఇప్పుడే ఆ సినిమా గురించి ఏమీ మాట్లాడలేనని, సరైన సమయం వస్తే అందరికీ తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది పరిణీతి చోప్రా.

అటు ఈ సినిమాలో చేస్తోందో లేదో ఖరారు చేయకుండా ఇటు రిజెక్ట్ చేయకుండా ప్రేక్షకులను సస్పెన్స్ లో పడేసింది ఈ భామ. ఇక తాజాగా ఈ వారం లో రాజమౌళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. కనీసం ఈ ప్రెస్ మీట్లో అయినా రాజమౌళి ఈ సినిమాలో హీరోయిన్ల గురించి క్లారిటీ ఇస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత జక్కన్న తీస్తున్న చిత్రమిది కావడం విశేషం. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ను గొప్పగా తీస్తున్నామని ఇటీవల రాజమౌళి ఓ సమావేశంలో చెప్పడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.