“బ్రహ్మాస్త్రం” నుంచి నాగార్జున ఊహించని లుక్ అదిరిపోయిందిగా.!

ఇప్పుడు మన తెలుగు అలాగే కన్నడ భారీ సినిమాల హవా పాన్ ఇండియా స్థాయిలో నడుస్తుంది. దీనితో బాలీవుడ్ లో మన సినిమాల హవా నడుస్తుంది అని అంతా ఫిక్స్ అయ్యారు కానీ బాలీవుడ్ నుంచి అయితే ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఆ సినిమానే “బ్రహ్మాస్త్ర”. ఈ సినిమాపై అయితే చాలా అంచనాలు ఉన్నాయి.

దర్శకుడు ఆర్యన్ అక్కడి స్టార్ హీరో రణబీర్ కపూర్ అలాగే స్టార్ హీరోయిన్ ఇప్పుడు రణబీర్ భార్య ఆలియా భట్ లతో తీసిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ ఏక్షన్ మరియు గ్రాఫికల్ చిత్రంగా వస్తుంది. అయితే ఈ సినిమాలో వారితో పాటుగా మన తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్ర చేస్తున్నారు.

అయితే మేకర్స్ ఇప్పుడు నాగ్ చేసిన ఆ సాలిడ్ రోల్ లుక్ ని రిలీజ్ చేశారు. అయితే నాగ్ పోస్టర్ చూస్తే మాత్రం అదేదో హాలీవుడ్ లెవెల్ ఫీల్ కలగక మానదు. తనకి ఏదో సూపర్ పవర్స్ ఉన్నట్టుగా నాగ్ ఇందులో కనిపిస్తున్నాడు. మొత్తానికి అయితే మాత్రం దీనితో మరింత స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం వసూళ్లు ఎలా ఉంటాయో చూడాల్సిందే. అలాగే ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో టై అప్ అయ్యి విడుదల కాబోతుంది. ఇక ఈ జూన్ 15న ఈ సినిమా మాసివ్ ట్రైలర్ రిలీజ్ కానుండగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతుంది.