‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ వుందట. ఆ స్పెషల్ సాంగ్ కోసం సీనియర్ హీరోయిన్‌ని సెర్చ్ చేస్తున్నాడట హరీష్ శంకర్. ఆ లిస్టులో పూజా హెగ్ధే, తమన్నా, శృతి హాసన్ పేర్లు వినిపిస్తున్నాయ్.
అయితే, పూజా హెగ్ధే మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి వుంది. డేట్స్ అడ్జస్ట్ కాక పక్కకు తప్పుకుంది. ఇప్పుడు స్సెషల్ సాంగ్ కోసమైనా వస్తుందో లేదో తెలీదు. ఇక, తమన్నా పరిస్థితి వేరే. వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది.
ఇక మిగిలింది శృతి హాసన్. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో ‘సలార్’ ఒక్కటే వుంది. ఆ సినిమాకి సంబందించి శృతి హాసన్‌కి పెద్దగా సీనూ సినిమా ఎలాగూ వుండదన్న వాదన వుంది. సో ఎటు చూసినా శృతి హాసన్ డేట్స్ దొరకడం ఏమంత కష్టం కాని పని. ఆల్రెడీ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో హిట్టు కొట్టాడన్న సెంటిమెంట్ కూడా వుంది శృతి హాసన్‌తో హరీష్ శంకర్‌కి.
సో, అలా శృతి హాసన్‌ని ఫైనల్ చేయాలనుకుంటున్నారట. అంతా బాగానే వుంది కానీ, స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ చాలా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. దాదాపు కోటి వరకూ అడుగుతోందనీ అంటున్నారు.
ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, శృతి హాసన్ ఇప్పుడేమంత ఫేమ్‌లో వున్న హీరోయిన్ కాదు. ఒకవేళ డిమాండ్ చేసినంతా ఇచ్చి తెచ్చుకున్నా సినిమాకి ఆమె స్పెషల్ సాంగ్ వల్ల ఒరిగేదేమీ వుండదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.