సెలబ్రెటీల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు వస్తున్నాయి. ఎప్పుడు ఎవరు..ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియదు. ముఖ్యంగా తప్పుడు కేసులు వంటివి కూడా చుట్టుకుంటూంటాయి. రేప్ కేసు పెట్టి ఇరికించి డబ్బులు లాగుదామని ఓ మహిళ ఓ టీవి ఆర్టిస్ట్ పై తప్పుడు కేసు పెట్టిన సంఘటన ఇప్పుడు బాలీవుడ్ షాక్ కు గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే…మహిళపై లైంగిక దాడి చేసిన వ్యవహారంలో టీవీ నటుడు కరణ్ ఒబేరాయ్ కటకటాల లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం ప్రయత్నించిన కరణ్ ప్రయత్నాలకు బాంబే హైకోర్టు ఎట్టకేలకు ఆయనకు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అసలు అతను రేప్ చేయటానికి ప్రయత్నించలేదని, కావాలని కుట్ర పూరితంగా ముగ్గురు కలిసి చేసిన ప్లాన్ ఇది అని తేలింది.
పోలీసుల విచారణలో ఆ మహిళ తప్పుడు కేసును నమోదు చేసినట్లు కనుగొన్నారు. వెంటనే ఆ మహిళను ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మే 26న కూడా మహిళ దాడి జరిగినట్లు పోలీసులకు తెలిపింది. ఇద్దరు దుండగులు తనపై దాడి చేసి కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించినట్లు చెప్పగా పోలీసులను వారిని పట్టుకొని ఇన్విస్టిగేట్ చేసారు. దాంతో ఈ ప్లాన్ అంతా మహిళదే అని ఆ ఇద్దరు వ్యక్తులు అసలు విషయాన్నీ బయటపెట్టారు.