ఇన్సైడ్ టాక్ : “ఆదిపురుష్” ఫైనల్ అవుట్ పుట్ పై ప్రభాస్ ముబావం??

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని ఉన్న లేటెస్ట్ చిత్రం “ఆదిపురుష్”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం టీజర్ తో అయితే అందరికీ షాకిచ్చింది.

టాకీ పార్ట్ వరకు కేవలం 180 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ కే ఎక్కువ రోజులు వర్క్ తీసుకుంది. సరే ఎక్కువ సమయం తీసుకున్నా మెప్పించే రేంజ్ లో ఆ విజువల్స్ ఉన్నాయా అంటే అది కూడా లేదు. దీనితో ఇప్పుడు ఇన్సైడ్ వర్గాల టాక్ అంటూ ఓ సమాచారం ఇప్పుడు వినిపిస్తుంది.

ఈ చిత్రం అవుట్ పుట్ చూసిన ప్రభాస్ ఓంరౌత్ తో బాలేదని చెప్పాడట. తాను ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో సాటిస్పై గా లేడని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అయితే ఇప్పుడు జోరుగా ప్రమోషన్స్ లో కనిపిస్తున్న ప్రభాస్ ని చూస్తుంటే మాత్రం అలా ఏమి ఉన్నట్టు కనిపించడం లేదు.

మరి తర్వాత ఏమన్నా రిలీజ్ విషయంలో తేడాలు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ వెనకడుగు వేసేలా కూడా లేరు. ఇంకా ఈ సినిమాలో సీతగా కృతి సనన్ నటించగా లంకేశునిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు.