జాకీ షరాఫ్ ను మేఘాలి అంతగా పొగిడేస్తుందే..?

మేఘాలికి కూడా సినిమా గ్రామర్  బాగా వంటబట్టినట్టు వుంది . ఎవరితో ఎలా మసలుకోవాలో , ఏ హీరోను ఎలా పొగడాలో నేర్చుకుంది అంటున్నారు. ఈ భామ విక్రంతో మొదటి తమిళ సినిమా “స్కెచ్” తో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు తమిళంలో “పాండి ముని “సినిమాలో ట్రైబల్ అమ్మాయిగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నాడు. ఇప్పుడు జాకీ షరాఫ్  గురించి మేఘాలు తెగ పొగిడేస్తోంది.

“జాకీ  చాలా పెద్ద నటుడు. అయినా అణువంతైనా గర్వం లేదు. చిన్న ఆర్టిస్టు  అయినా నన్ను ఎంతో అభిమానంగా చూశాడు” అని చెబుతుంది. పాండి ముని  సినిమాలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ట్రైబల్ అమ్మాయిగా నటిస్తున్నాని, ఒకానొక సందర్భంగా  చనిపోయి దెయ్యమై  తిరుగుతుంటా, ఇక జాకీ  అఘోరీ గా కనిపిస్తాడని ఈ సినిమా కథ మొత్తం చెప్పేస్తుంది.

జాకి షరాఫ్  లాంటి నటుడు అరుదుగా కనిపిస్తాడని సర్టిఫికెట్ కూడా ఇస్తుంది మేఘాలి. ఏమై ఉంటుందని అంటారు?