ఇండస్ట్రీ టాక్ : “గాడ్ ఫాదర్” కి నైజాం లో ఎంత బిజినెస్ జరిగిందంటే.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార ఓ కీలక పాత్రలో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాదర్”. ఈ దసరా కానుకగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించాడు.

అయితే దీనికి ముందు మెగాస్టార్ నుంచి భారీ డిజాస్టర్ “ఆచార్య” ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి భారీ మొత్తంలో బిజినెస్ జరుగుతూ ఉండడం షాకింగ్ అని చెప్పాలి. ఓవరాల్ గా అన్ని హక్కులు కలిపి 200 కోట్ల మేర బిజినెస్ ని ఈ సినిమా టచ్ చెయ్యగా ఇప్పుడు కొన్ని ఏరియా లకి సంబంధించి అప్డేట్స్ తెలుస్తున్నాయి.

మరి మన తెలుగులో అయితే నైజాం ప్రాంతంలో ఈ చిత్రాన్ని 22 కోట్ల బిజినెస్ జరిగింది అట. దీనితో అయితే ఈ సినిమా అక్కడ గట్టెక్కాలి అంటే 22 కోట్ల షేర్ రాబట్టి అంతకు మించి వసూళ్లు అందుకోవాలని చెప్పాలి.

ఇప్పుడున్న అంచనాలతో అయితే ఎలా లేదన్నా సినిమా మొదటి రోజే సగానికి దగ్గర వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాతో అయినా మెగాస్టార్ గట్టి కం బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించాడు. ఎఎన్ వి ప్రసాద్ నిర్మాణం వహించారు..