బిగ్ అప్డేట్ : ఓటిటీలో “కెజిఎఫ్ చాప్టర్ 2” అసలు రిలీజ్ కి డేట్ వచ్చేసింది.!

ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో హిగ్స్ గ్రాసింగ్ లిస్ట్ లో ఉన్న చిత్రాల్లో ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు చేరాయి. అది కూడా మన సౌత్ ఇండియన్ సినిమా నుంచే ఒకటి తెలుగులో ట్రిపుల్ ఆర్(RRR) కాగా మరొకటి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన “కేజీఎఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి.
దర్శకుడు ప్రశాంత్ నీల్ రాకింగ్ స్టార్ యష్ తో తీసిన ఈ సెన్సేషనల్ హిట్ 1200  వసూళ్ళని అందుకొని సంచలనం రేపింది. అయితే ఈ సినిమా రీసెంట్ గా ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏకంగా 200 పెట్టి రెంట్ కి తీసుకొచ్చారు. దీనితో పలు విమర్శలు వచ్చాయి.
కానీ ఇప్పుడు ఫైనల్ గా అసలు స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు వారు అనౌన్స్ చేసారు. ఈ జూన్ 3 నుంచి రెంట్ లేకుండా స్ట్రీమింగ్ కి తీసుకున్నట్టు బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇక ఇక్కడ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.
ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించగా సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే రవి బాసృర్ సంగీతం అందించగా హోంబేళే ఫిలిమ్స్ వారు డీసెంట్ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

https://twitter.com/PrimeVideoIN/status/1531553692125904897