రివ్యూ : కోబ్రా

 

నటీనటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు

దర్శకత్వం : ఆర్ అజయ్ జ్ఞానముత్తు

నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్

సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ: హరీష్ కన్నన్

ఎడిటర్: భువన్ శ్రీనివాసన్

చియాన్ విక్రమ్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కోబ్రా ఈ రోజు రిలీజ్ అయింది. మరీ ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

క‌థ‌:

మది (విక్రమ్) – ఖదీర్ (మరో విక్రమ్) ఇద్దరు అన్నదమ్ములు. అయితే, చిన్నతనం నుంచి ఖదీర్ మానసిక సమస్యలతో బాధ పడుతూ ఉంటాడు. దీనికి తోడు వీరి జీవితాల్లో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా ఇద్దరూ మది పేరుతోనే ఒక్కరిగా బతుకుతూ ఉంటారు. అయితే, పెరిగి పెద్దయ్యాక మది మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. మరో వైపు సీరియస్ క్రైమ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇంటర్ నేషనల్ రేంజ్ లో మది కొన్ని హత్యలు కూడా చేస్తాడు. అసలు ఈ హత్యలను మది ఎందుకు చేస్తున్నాడు ?, ఎవరి కోసం చేస్తున్నాడు?, మరో వైపు భావన (శ్రీనిధి శెట్టి) మదిని ప్రేమిస్తూ ఉంటుంది. ఆమెకు మది ఎందుకు దూరంగా ఉంటాడు ?, ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం ఖదీర్ (మరో విక్రమ్), మది పై పగ బట్టి అతన్ని అంతం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అసలు మదికి – ఖదీర్ కి మధ్య ఏం జరిగింది ?, ఖదీర్ ఎందుకు మది పై పగ బట్టాడు ? చివరకు ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ.

 

Cobra movie review
Cobra movie review

విశ్లేషణ :

ఈ కోబ్రా మూవీలో విజువల్స్ అండ్ యాక్షన్ బాగున్నాయి. అయితే, స్టోరీ అండ్ ఎమోషన్ మిస్ అయ్యింది. మెయిన్ గా హీరో డబుల్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. చియాన్ విక్రమ్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఈ సినిమాకు ఒక సరికొత్త ఎనర్జీ ఇచ్చాడు. విక్రమ్ నటన అద్భుతంగా సాగింది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ దొరికంది.
ఇర్ఫాన్ కూడా చాలా బాగా నటించాడు.

అలాగే ఇతర పాత్రల్లో నటించిన నటినటులు మియా జార్జ్, కేఎస్ రవికుమార్, మృణాళిని రవిలు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా విలన్ రోల్ లో కనిపించిన అతను తనలోని విలన్ యాంగిల్ ను అద్భుతంగా పండించాడు. అలాగే కామిక్ పాత్రల్లో కనిపించిన కమెడియన్లు కూడా తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్నిచోట్ల బాగా నవ్వించారు. కానీ, కోబ్రా కథనం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ లో విక్రమ్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టు లేదు.

పైగా సింపుల్ పాయింట్ తో మది – ఖదీర్ అనే రెండు పాత్రల చుట్టూ మొత్తం కథను చుట్టేయడం, అలాగే కోబ్రా లోని మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయలేకపోవడం, దీనికితోడు ఆడియన్స్ కి మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో మొత్తానికి ఈ కోబ్రా సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

 

ప్లస్ పాయింట్స్ :

విక్రమ్ స్క్రీన్ ప్రెజెన్సీ అండ్ నటన,

టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్,

సాంకేతిక వర్గం పనితీరు.

మైనస్ పాయింట్స్ :

లాజిక్ లెస్ యాక్షన్ డ్రామా,

కన్ ఫ్యూజ్డ్ నేరేషన్ తో సాగే బోరింగ్ ఎలిమెంట్స్

సినిమాటిక్ టోన్ మరీ ఎక్కువ అవ్వడం,

స్క్రిప్ట్ సింపుల్ గా ఉండటం.

 

తీర్పు :

సస్పెన్స్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ కోబ్రాలో కొన్ని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే సినిమా మెయిన్ పాయింట్ లో కంటెంట్ బాగుంది. కానీ, మిగిలిన బాగోతం అంతా రొటీన్ అండ్ బోరింగ్ వ్యవహారాలతోనే సాగింది. లోకల్ బాయ్ దగ్గర నుంచి ఇంటర్ నేషనల్ ఇష్యూ వరకూ సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఏ సీన్ కనెక్ట్ కాదు. ఓవరాల్ గా కన్ ఫ్యూజ్డ్ నేరేషన్ తో అండ్ సిల్లీ ప్లేతో ఈ సినిమా అంచాలను అందుకోలేకపోయింది.

 

రేటింగ్ : 2.5 / 5

 

బోటమ్ లైన్ : కన్ ఫ్యూజన్ వర్సెస్ రొటీన్ యాక్షన్ !/